*సమాజ సేవలో కేసి గుప్తా సేవలు మరువలేనివి*
సమాజ సేవలో కల్వకుంట్ల చంద్రసేన గుప్త సేవలు మరువలేనివని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. మంగళ వారం కే సి గుప్త జన్మదినమును పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ లో ఏర్పాటుచేసిన కేసి గుప్త విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన సేవలను స్మరించుకుంటూ మాట్లాడారు. కే సి గుప్తా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడని తెలిపారు. అట్టడుగు వర్గాల లో ఉన్న పేదలకు సేవలు అందించాలనే సంకల్పంతో ఆర్యవైశ్యుల కులదైవము శ్రీ వాసవి మాత పేరుతో శ్రీ వాసవి క్లబ్ స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వాసవి ఇంటర్నేషనల్ ద్వారా కొన్ని కోట్ల మంది సభ్యులుగా ఉండి సమాజ సేవ చేస్తున్నారని కొనియాడారు. కే సి గుప్తను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు తమవంతుగా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలన్నారు.వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి గత తొమ్మిది సంవత్సరముల క్రితం శ్రీ వాసవి సేవా సమితిని స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా శ్రీ వాసవి సేవాసమితి నీ విస్తరింపజేసి ఎన్నో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సూర్యాపేట జిల్లా లో ఇటీవల శ్రీ వాసవి సేవా సమితిని ప్రారంభించగా సుమారుగా 200 మంది సభ్యులు గా చేరి సమాజసేవలో పాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక సామాజిక సేవలలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్, తప్సీ గాంధీ, చల్లా సత్యనారాయణ, బుద్ధ శ్రీనివాస్ గుప్తా, సోమ శ్రీశైలం, చందా రాజశేఖర్, గుడిపాటి రమేష్, గుండా వెంకన్న, తల్లాడ కృష్ణమూర్తి, చింతా వెంకన్న,కందిబండ సూరయ్య, కొత్త వెంకటేశ్వర్లు, నమిలిపురి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

