కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన – బ్రాహ్మణపల్లిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, IPS .

Date:

Share post:

📰 Generate e-Paper Clip

అక్టోబర్‌ 4వ తేదీన బ్రాహ్మణపల్లిలో జరగనున్న అమూల్‌ మిల్క్‌ బల్క్‌ యూనిట్‌ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.

ఈ VVIP పర్యటన సజావుగా జరిగేలా మెదక్ జిల్లా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా గురువారం జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, IPS బ్రాహ్మణపల్లిని సందర్శించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.

భద్రతా ఏర్పాట్లపై అదనపు ఎస్పీ సూచనలు:

ఏర్పాట్ల పరిశీలన: అమూల్‌ ఫ్యాక్టరీ శంకుస్థాపన ప్రదేశం, బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్‌ మరియు వీవీఐపీ కాన్వాయ్‌ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్షించారు.

ట్రాఫిక్ & పార్కింగ్: సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అప్రమత్తత: వీవీఐపీ బందోబస్తులో పాల్గొనే పోలీస్ సిబ్బంది అంతా అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ఇతర శాఖలతో సమన్వయంతో ముందస్తు భద్రతా చర్యలను అమలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్‌ డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌ , సీఐ వెంకట రాజా గౌడ్‌, పలువురు ఎస్‌ఐలు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు మరియు అమూల్‌ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!!

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి//హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 63 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్,...

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.