ముఖ్యమంత్రి సభకు పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులు తరలిరావాలి.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

Date:

Share post:

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల:

ఈనెల 30వ తేదీన సిరిసిల్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నిర్వహించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలిరావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి అడ్లూరి మెప్మా మహిళలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా పథకాలను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటుచేసి వ్యాపార రంగంలో రాణించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల సభకు వస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

సిరిసిల్ల సభ విజయవంతం., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజల నీరాజనాలు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల...

కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను....

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన గ్రాండ్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల అభిమానం మధ్య సాగిన ఈ పాదయాత్ర సిరిసిల్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.