మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌

Date:

Share post:

📰 Generate e-Paper Clip

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలోని రహదారి పరిస్థితులు,డివైడర్‌ తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమైన సంఘటన అన్నారు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన మేరకు ఆటో రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తూ, ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందన్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందడం అత్యంత విషాదకరమని, మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. వారు తమ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం ఉందన్నారు. ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు.
రహదారి మధ్యలోని డివైడర్‌లో ఉన్న ఖాళీ ద్వారా వాహనాలు అక్రమంగా మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు.ఈ ప్రాంతాన్ని ప్రమాదకర ప్రాంతంగా గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. రహదారిపై అవసరమైన నిర్మాణాత్మక మార్పులు చేయడం, డివైడర్‌లోని ఖాళీని మూసివేయడం, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన చర్యలు చేపట్టడం వంటి అంశాలపై సంబంధిత శాఖలకు ప్రతిపాదనలు పంపించి,వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి అవసరమైన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొంతమందిని ఇప్పటికే కరీంనగర్‌కు తరలించామని, మరికొందరు మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు.బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా స్థానిక కలెక్టర్‌తో కూడా మాట్లాడి సమన్వయం చేస్తున్నామని సీపీ తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, అవసరమైన ఇంజినీరింగ్‌ చర్యలు,ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.