మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తె అరెస్ట్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్‌లో 29-09-2026న జరిగిన మోహన్ హత్య కేసుకు సంబంధించి మృతుడి భార్య జమున (39), ఆమె కుమార్తెను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపారు.
మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు మోహన్‌కు అతని భార్య జమునకు మధ్య వివాహ సంబంధిత మనస్పర్థల కారణంగా 28-09-2026 రాత్రి గొడవ జరిగింది.ఈ గొడవను మనసులో పెట్టుకున్న జమున తన కుమార్తెతో కలిసి 29-09-2026 తెల్లవారుజామున మోహన్‌పై రోకలి బండతో తలపై బలంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన మోహన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుల ప్రమేయం వెలుగులోకి రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం నిందితులను గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు తెలిపారు.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.