హైదరాబాద్ నగర శివారులో భారీ నకిలీ కరెన్సీ 6.7 కోట్ల రూపాయలు స్వాధీనం యదేచ్చగా కొనసాగుతున్న నకిలీ నోట్ల దందా…. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక ఉగ్రవాదం 

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్

హైదరాబాద్ నగర శివారులో భారీగా చలామణి చేసేందుకు సిద్ధం చేసిన నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఏకంగా రూ.6.7 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది.

 

నలుగురి అరెస్ట్..

విశ్వసనీయ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నకిలీ కరెన్సీని రహస్యంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేయగా కోట్ల రూపాయల దొంగ నోట్లు లభ్యమయ్యాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6.7 కోట్ల నకిలీ కరెన్సీతో పాటు వాహనాన్ని, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఇంత భారీ మొత్తంలో నకిలీ నోట్లు ఎక్కడి నుంచి ముద్రించి తీసుకువచ్చారు, వారి వెనుక ఉన్న బడా బాబులు ఎవరు అనేది విచారణలో తెలియాల్సి ఉంది.

spot_img
spot_img

Related articles

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!!

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి//హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 63 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్,...

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.