రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్పోర్ట్స్ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్…!

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

మహబూబ్ నగర్ జిల్లాలో మరో అవినీతి అధికారి, కంప్యూటర్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎందుకు సంబంధించి ఏసీబీ మహబూబ్ నగర్ డిఎస్పి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ కు రూ.మూడు లక్షల విలువైన బిల్లులు చేయవలసి ఉంది. అందుకుగాను యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. ఆ కాంట్రాక్టర్ ఎంతగా విజ్ఞప్తి చేసిన డిమాండ్ చేసినంత లంచం ఇవ్వాలని డిప్యూటీ అండ్ ఎస్ఓ డిమాండ్ చేశాడు. దీనితో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించి తన గోడును వెల్లబోసుకున్నాడు. దీనితో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి గురువారం బలపన్నారు. మహబూబ్ నగర్ పట్టణం క్లాక్ టవర్ సమీపంలో ఒక హోటల్లో భోజనం చేసిన తర్వాత కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు తీసుకోగా డిప్యూటీ అండ్ ఎస్ ఓ, కంప్యూటర్ ఆపరేటర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.

spot_img
spot_img

Related articles

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!!

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి//హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 63 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్,...

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.