సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ అయ్యారు; సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ జారీ చేయాలని కోరారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం ఈ సందర్భంగా వివరించారు. సమ్మక్క సాగర్‌ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని సీఎం కోరారు.
సీఎం విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టును తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించారు. ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ అధ్యయనం ప్రకారం, పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురవుతుంది. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదు. అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్‌ లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి సమర్పించింది.

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్‌ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలని సీఎం కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

spot_img
spot_img

Related articles

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి.. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

మహేశ్వరం, నవంబర్ 16, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు....

నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఉచితంగా 8 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ

నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఉచితంగా 8 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ! శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి.. శిక్షణ పూర్తి చేసిన వారికి రూ.4,000 ఆర్థిక...

పీఎం జన్మన్ ఇళ్ల సమావేశాన్ని విజయవంతం చేయాలి.కోలాం తెగకు చెందిన ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలి.

పోరు తెలంగాణ నవంబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా.   ఆసిఫాబాద్: పీఎం జన్మన్ పథకం కింద ఇళ్ల మంజూరు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు మంగళవారం...

పీఎం జన్మన్ ఇళ్ల సమావేశాన్ని విజయవంతం చేయాలి.కోలాం తోటి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలి.

  పోరు తెలంగాణ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 16: ఆసిఫాబాద్: పీఎం జన్మన్ పథకం కింద ఇళ్ల మంజూరు, సంబంధిత సమస్యలపై చర్చించేందుకు మంగళవారం...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.