186 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి కృతజ్ఞతలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

*పినపాక నియోజకవర్గ అభివృద్ధికి భారీ నిధులు తీసుకువచ్చిన ఎమ్మెల్యేకు అభినందనలు*

మణుగూరు పినపాక నియోజకవర్గంలోని బీటీ రహదారులు, వంతెనలు, బ్రిడ్జిల అభివృద్ధి కోసం హెచ్‌ఏఎం నిధుల నుంచి సుమారు రూ.186 కోట్ల భారీ నిధులు మంజూరు చేయించడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
నియోజకవర్గ ప్రజల చిరకాల రహదారి సమస్యలకు పరిష్కారం చూపేలా ఇంత భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్, జిల్లా ముఖ్య నాయకులు దొబ్బల వెంకటప్పయ్య, శివ సైదులు, సర్పంచులు కలబోయిన మాధవరావు, పాల్వంచ రాములు, జీవి, వార్డు సభ్యులు బర్ల శ్వేతన్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హెచ్‌ఏఎం నిధులతో నియోజకవర్గంలోని రహదారులు, వంతెనలు మరింత అభివృద్ధి చెందడంతో గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని నాయకులు పేర్కొన్నారు. దసరా పండుగలోపే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటుండటం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా పనులు పూర్తయిన అనంతరం సుమారు 15 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యత సంబంధిత సంస్థలదే ఉండే విధంగా హెచ్‌ఏఎం విధానంలో పనులు చేపట్టడం వల్ల రహదారుల నాణ్యత, నిర్వహణకు మరింత భరోసా ఉంటుందని తెలిపారు.
ఈ నిధుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ భారీ స్థాయిలో నిధులు తీసుకువస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

సిరిసిల్ల సభ విజయవంతం., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజల నీరాజనాలు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల...

కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను....

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...

సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన గ్రాండ్ సక్సెస్

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన లో నాయకులు, కార్యకర్తల ఉత్సాహం, ప్రజల అభిమానం మధ్య సాగిన ఈ పాదయాత్ర సిరిసిల్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.