రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారికి అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్ కమిషనర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతంతో పాటు రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ”ను ఆలపించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలందరికీ ఎంతో ప్రాముఖ్యత కలిగిన చారిత్రక దినమని పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తెలంగాణ ప్రాంతం ప్రజాపాలనలోకి వచ్చిన సెప్టెంబర్ 17వ తేదీకి చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు.ఇదే రోజున అప్పటి నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనమై,సమగ్ర భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు.ఈ చారిత్రక పరిణామం కోసం నాడు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసిన వారందరినీ ఈ సందర్భంగా గౌరవంగా స్మరించుకోవాలని తెలిపారు.వారి త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేసేలా ప్రోత్సహించాలని సూచించారు.
పోలీస్ శాఖ తరఫున ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, వారికి భద్రత, సౌకర్యాలు కల్పించడం, శాంతిభద్రతలను మరింత పటిష్టంగా పరిరక్షించడం తమ ప్రధాన బాధ్యత అని పోలీస్ కమిషనర్ తెలిపారు.ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి భద్రత, సంక్షేమం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందన్నారు.
సెప్టెంబర్ 17 సందర్భంగా ఈ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని మరింత సమర్థవంతంగా కొనసాగించాలని తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందిస్తూ, శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షిస్తూ,రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్,ప్రవీణ్ కుమార్,టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు,ఏవో శ్రీనివాస్, ఆర్ఐలు మల్లేశం, దామోదర్,రమేష్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాద్ రావు,రామగుండం సీఐ కృష్ణ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు,సీపీఓ సిబ్బంది,వివిధ విభాగాల సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, ప్రత్యేక బృందాల సిబ్బంది పాల్గొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
Date:
Share post:

