పశువుల అక్రమ రవాణా కేసుల్లో అయిదురికి రిమాండ్.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

చింతల మానేపల్లి సెప్టెంబర్ 18:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో పశువులను అక్రమంగా తరలించిన కేసుల్లో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు ఎస్సై ఎం. కమలాకర్ తెలిపారు. జూలై 21న కర్జలి గ్రామ సమీపంలో మహీంద్రా జైలో వాహనంలో పశువులను అక్రమంగా తరలించిన కేసులో మహారాష్ట్రకు చెందిన A4 నిందితుడు కృష్ణ అలియాస్ రాజును అరెస్టు చేశారు. అలాగే ఆగస్టు 11న ఆడపెల్లి గ్రామంలో పాల వ్యాన్‌లో పశువులను అక్రమంగా తరలించిన కేసులో కాగజ్‌నగర్‌కు చెందిన A1 ఇనాయత్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్సిని గ్రామంలో సరైన పత్రాలు లేకుండా పశువులను తరలించిన కేసులో బెజ్జూరు మండలం సలుగుపల్లికి చెందిన A1 ఇప్ప అంజయ్య, మహారాష్ట్రకు చెందిన A2 కొడుపే జితేంద్ర యశ్వంత్‌లను అరెస్టు చేశారు. దిందా గ్రామంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఐదు ఎడ్లను అక్రమంగా తరలించిన కేసులో మహారాష్ట్రకు చెందిన గోలేటివార్ అశోక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. పశువులను తరలించే సమయంలో తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ఎం. కమలాకర్ హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసుల తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

spot_img
spot_img

Related articles

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...

జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షునిగా కాసిపేట సతీష్ కుమార్

కాంగ్రెస్గ్  పార్టీ జైపూర్ మండల సెల్ అధ్యక్షునిగా జైపూర్ మండలం నర్సింగాపూర్ (ఎస్) గ్రామానికి చెందిన కాసిపేట సతీష్ ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా కాసిపేట...

అటవీ ప్రాంతంలో అరుదైన నీలి రంగు పుట్టగొడుగు.

సిర్పూర్ (టీ) అక్టోబర్ 01: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌(టి) అటవీ డివిజన్‌ పరిధిలోని మాకిడి నెక్షన్‌, గొల్యాల్‌ అటవీ ప్రాంతంలో అరుదైన నీలిరంగు పుట్టగొడుగు...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.