అనుమతి లేకుండా చెట్లు నరికితే కఠిన చర్యలు – అటవీ శాఖ హెచ్చరిక

Date:

Share post:

📰 Generate e-Paper Clip

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 18:

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం, అటవీ ఉత్పత్తులను అక్రమంగా తరలించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి సి హెచ్ బాలమణి హెచ్చరించారు. చెట్లు పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు వర్షపాతం, భూగర్భ జలాల సంరక్షణ, వన్యప్రాణుల ఆవాసాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఒక్క చెట్టును నరికివేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలగడమే కాకుండా, వన్యప్రాణుల నివాస ప్రాంతాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అటవి శాఖ అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం, కలపను అక్రమంగా రవాణా చేయడం, నిల్వ చేయడం వంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అక్రమంగా చెట్లు నరికివేస్తున్నట్లు గమనించినట్లయితే సమీపంలోని అటవీ శాఖ కార్యాలయం లేదా సంబంధిత అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ అటవీ సంపదను సంరక్షించడంలో అటవీ శాఖకు సహకరించాలని జిల్లా అటవీ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.

 

Regards,

Mohd Issak

CC to DFO KBM ASIFABAD.

spot_img
spot_img

Related articles

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన...

జగిత్యాలలో భారీ ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం వెలుగులోకి“ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు రూ.5 కోట్ల పెట్టుబడులు సేకరించి మోసం చేసినట్లు ఫిర్యాదు

జగిత్యాల// అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు సేకరించిన కేసులో ఓ వ్యక్తిని జగిత్యాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. “ASPECT TRADER” యాప్ పేరుతో దాదాపు...

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం

రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్, నార్కోటిక్ విభాగం సంయుక్తంగా విద్యార్థులకు...

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తనిఖీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని మందమర్రి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.