SIR–2026పై రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి*

*అక్టోబర్ 25లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి*

*జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి*

ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని *రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి* ఆదేశించారు.

ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీరాములు, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ* ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

బీఎల్‌ఓ స్థాయిలో ఐదు రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

నోటీసుల జారీ, విచారణ, దరఖాస్తుల పరిష్కారం వంటి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు.

అక్టోబర్ 25 గడువును దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని, చివరి దశలో పనులు పేరుకుపోకుండా ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో, ఏఈఆర్‌ఓలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

హైదరాబాద్// హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ...

హిమాచల్ ప్రదేశ్ లోని మౌంట్ తరంగ్ 2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన గురుకుల విద్యార్థి 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్‌ అవలీలగా అధిరోహించిన ఇస్లావత్‌ బన్నీ తొలి భారతీయ బృందంలో చోటు.....

హైదరాబాద్‌, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తయిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్‌ బన్నీ నిరూపించారు....

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.