ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హైదరాబాద్//

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం.

బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రో రైలులో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సచివాలయం వరకు ప్రయాణించడం జరిగింది . ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది .

ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ వరకు ప్రజలకు సులభమైన కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌కు శ్రీకారం.

ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజల అనుభవాలను నేరుగా తెలుసుకుంటూ, వారి అవసరాలకు అనుగుణంగా రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 15 మంది మంత్రులకు ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కొనుగోలు చేశారు.

ప్రజలకు సౌకర్యవంతమైన, సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను అందించేందుకు ఈ కార్యక్రమం ఒక కీలక ముందడుగుగా నిలిచింది.

spot_img
spot_img

Related articles

*అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు..* *సదరం సర్టిఫికెట్ల జారీలో అధికారు లు ప్రత్యేక చొరవ చూపాలి..* *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* *మెట్ పల్లి లో...

/మెట్ పల్లి టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ...

ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్ * ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా 1M1B సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, లైఫ్...

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.