*అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు..* *సదరం సర్టిఫికెట్ల జారీలో అధికారు లు ప్రత్యేక చొరవ చూపాలి..* *రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* *మెట్ పల్లి లో చేయూత పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

/మెట్ పల్లి

టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గానికి నూతనంగా మంజూరు అయిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మెట్ పల్లి లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరు కాగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జూవ్వాడి నర్సింగరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేదవారికి సహాయం అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట సభలో ఇందిరమ్మ బీమా పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చేసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణ చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముందు టిఆర్ఎస్ అధినేత్రి కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పాలని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కోరుట్ల నియోజకవర్గం 3737 చేయూత పెంచాలని ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో పాటు సదరం సర్టిఫికెట్ల జారీలో ఉన్న ఇబ్బందులను అధికారులు వెంటనే పరిష్కరించి పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

spot_img
spot_img

Related articles

ఆధారిత వ్యాపారాలకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్ * ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా 1M1B సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, లైఫ్...

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి...

ఏసీబీ సంచలనం! రూ 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సర్పంచ్! డిమాండ్ చేసింది రూ 30 లక్షలు!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మోదుగడ్డ తండా గ్రామ సర్పంచ్ ధరావత్ వీరు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు! ఖమ్మంలో...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.