హైదరాబాద్
* ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా 1M1B సంస్థ నిర్వహించిన గ్లోబల్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ఈరోజు ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, ఏఐ, అధునాతన తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను అంతర్జాతీయ ప్రతినిధులకు ఈ సందర్భంగా మంత్రి ఈ సందర్భంగా వివరించారు.
* తెలంగాణ ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని, ప్రస్తుతం ఏఐ, అధునాతన తయారీ సహా నూతన సాంకేతిక రంగాల్లోనూ వేగంగా విస్తరిస్తోందని మంత్రి అన్నారు. ప్రతిభావంతులైన యువత, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు, బలమైన పారిశ్రామిక పునాదులు రాష్ట్రానికి ప్రధాన బలమని తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.
* ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలను వైద్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి వంటి రంగాల్లో వినియోగించడం ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి అన్నారు. సాంకేతిక ప్రగతి, ఆవిష్కరణలు, మానవాభివృద్ధి సమాంతరంగా సాగినప్పుడే సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే బలమైన ఆవిష్కరణల వ్యవస్థ ఏర్పడుతుందని మంత్రి అన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం ఇన్నోవేషన్ ఆధారిత ఎకో సిస్టంను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తోందన్నారు.
* యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంతో పాటు, వారి ఆలోచనలను ప్రపంచస్థాయి ఆవిష్కరణలుగా మలిచేందుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి… రైజింగ్ తెలంగాణ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వినియోగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.

