వినాయక నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీపీ సమన్వయ సమావేశం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి//వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్,సింగరేణి, మున్సిపల్, రెవెన్యూ,విద్యుత్, వైద్య ఆరోగ్య, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక,ఫిషరీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు,భద్రతా చర్యలు,ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై సీపీ అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ, వినాయక నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగే నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.గత సంవత్సరం నిమజ్జనం సందర్భంగా ఎదురైన సమస్యలు, ఇబ్బందులు, లోపాలను సమీక్షించి,అవే సమస్యలు ఈ సంవత్సరం పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నిమజ్జన ప్రదేశాలు, శోభాయాత్ర మార్గాలు,రద్దీ ప్రాంతాలు,పార్కింగ్ ప్రదేశాలను ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఫిషరీస్,సంబంధిత శాఖల అధికారులు నిమజ్జన ప్రదేశాల్లో నీటి లోతు, ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు రక్షణ సిబ్బంది,శిక్షణ పొందిన ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, అవసరమైన రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
మున్సిపల్ అధికారులు నిమజ్జన ప్రదేశాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు,లైటింగ్, రోడ్ల పరిస్థితి, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు నిమజ్జన మార్గాలు, మండపాలు, నిమజ్జన ప్రదేశాల్లో విద్యుత్ వైర్లు, స్తంభాలు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను ముందుగానే పరిశీలించి,ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అగ్నిమాపక శాఖ అధికారులు అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఫైర్ టెండర్లు,సిబ్బంది, రక్షణ పరికరాలను కీలక ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని తెలిపారు.సింగరేణి అధికారులు తమ పరిధిలోని నిమజ్జన మార్గాలు, రహదారులు, సంబంధిత ప్రాంతాల్లో అవసరమైన సహకారం అందించాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
పోలీస్ అధికారులు నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ,రద్దీ నిర్వహణ, బందోబస్తు, పార్కింగ్,క్రేన్‌లు, ఇతర అత్యవసర సేవల సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,ఆర్‌జీ-1 జీఎం లలిత్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, జైపూర్ సీఐ నవీన్ కుమార్,ఎస్‌ఐ భూమేష్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

Nov 16, 2026, టీజీపీఎస్సీ ద్వారా 102 స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ TGPSC రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కవేటి సబిత మనోహర్.

కాగజ్‌నగర్‌లో వివాహ వేడుకకు హాజరు.. మహారాజ సభను సందర్శన....   పోరు తెలంగాణ నవంబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్‌నగర్: టీఆర్ఎస్ పార్టీ...

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ!

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు.. నవంబర్ 19న ఖాతాల్లోకి నగదు జమ! Nov 15, 2026, తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త...

రేపు న్యూఢిల్లీలో సోనియా గాంధీ పుస్తకావిష్కరణ

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి// హైదరాబాద్ Nov 15, 2026, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్ 16న సాయంత్రం...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.