భీమారం మండల కేంద్రంలో ని బీసీ కాలనీ శ్రీరామ యూత్ గణేష్ మండలి వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భక్తి,శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని వారి వారి కోరికలు తీరాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించారు.ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ,ఆగణనాథని కృపా,కటాక్షం వల్ల ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో,ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపాలని ఆ ఏకదంతున్నీ ప్రార్థించారు.అన్నదాన కార్యక్రమానికి ఆర్థికంగా, వస్తురూపమైన,సహాయ, సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
భీమారం మండల కేంద్రంలోని బీసీ కాలనీ శ్రీ రామ యూత్ గణేష్ మండలి వద్ద అన్న ప్రసాద వితరణ
Date:
Share post:

