ఇటీవల స్వర్గస్తులైన ఆర్య వైశ్య ప్రముఖులు, CPM నాయకులు, స్వాతంత్ర సమర యోధులు, పాతర్ల పాడు వాస్తవ్యులు తెలుకుంట్ల పురుషోత్తంకు మండలం ప్రముఖులు అందరూ 2 నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించటం జరిగింది. తెలుకుంట్ల పురుషోత్తం ఒక అలనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తింపు పొందారురాని అంతే కాకుండా రాజకీయ నాయకుడుగా సిపిఎం పార్టీలో సేవలందిస్తూ, సిపిఎం పార్టీ ద్వారా తన చింతకాని మండలం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని ప్రముఖులు తన చేసిన పనులు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, తెలుకుంట్ల పురుషోత్తం తమ మధ్యన భౌతికంగా లేకపోయినా తమ మండల ప్రజల్లో గుండెలో స్తిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో చింతకాని మండలం ఆర్య వైశ్య మండలం అధ్యక్షులు నాగుబండి వెంకట నారాయణ , చింతకాని మండలం ఆర్య వైశ్య ప్రముఖులు తెలుకుంట్ల శ్రీనివాస్ , వాసవి క్లబ్ జోన్ చైర్మన్ బీజ్జల విశ్వనాధం, వాసవి క్లబ్ జోన్కో చైర్మన్దు కోదుమూరు మొహస్ రావు, వాసవి క్లబ్ శివాలయం ప్రెసిడెంట్ మారేమిల్లి రామకృష్ణ , వాసవి క్లబ్ పులిపాటి నగర్ ప్రెసిడెంట్ కోదుమూరు భద్రయ్య, సెక్రటరీ సిద్ధంశెట్టి శ్రీకాంత్ , వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ సెక్రటరీ చలువాదిశ్రీనివాస్ , కోశాధికారి పెనుగొండ సూర్య ప్రకాష్ ,వైస్ ప్రెసిడెంట్ తెలుకుంట్ల శ్రీనివాస్, సభ్యులు కందిబండ బిక్షమయ్య, భూమా నవీన్ తదితరులు పాల్గొన్నారు.

