ముప్కాల్ మండల వార్డు మెంబర్ ల కమిటి అధ్యక్షుడిగా కంచు సతీష్ ను ఎన్నుకున్నట్లు జిల్లా వార్డు మెంబర్ అసోసియేషన్ కమిటి ఆదివారం తెలిపింది.తెలంగాణ వార్డు మెంబర్ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులు నాంపల్లి జ్యోతి ఆదేశాల మేరకు జిల్లా వార్డ్ మెంబర్ కమిటి ఇంచార్జి కర్బ సాయిలు, కో ఇంచార్జి సిరికొండ కళ్యాణ్ ల సమక్షంలో సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీలో ఉపాధ్యక్షునిగా సురేష్,దీపక్,రాజు , కార్యదర్శిగా ప్రదీప్,కో ఆర్డినేట్స్ గా రాజేశ్వర్,మల్లయ్య, సలహాదారులుగా సాయిలు, సవిత,అంజలి,రాజు,సభ్యులు గా సవిత, మయూర్, రాజు,సోని, గంగాధర్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

