ప్రభుత్వం తరఫున శిరీష కుటుంబంకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును, అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఉకే శిరీష కుటుంబానికి అండగా మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు పాయం , జారే కోరం తెల్లం

ములకలపల్లి సెప్టెంబర్ 4 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఉకే శిరీష ఇటీవల హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమె స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శిరీష కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.

ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును, అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను బాధిత కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఆదివాసీ కుటుంబానికి చెందిన శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్ తుక్కుగూడలో చోటుచేసుకున్న శిరీష హత్య ఘటన అమానుషమని, మానవ రూపంలో ఉన్న మృగం చేసిన దారుణ హత్యగా పేర్కొంటూ సభ్య సమాజం తలదించుకునే ఘటన అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సీపీతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి , ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా శిరీష నివాసం ఉన్న ఆసుపత్రి వసతి గృహంలో సమగ్ర విచారణ చేపట్టి, నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి తో మాట్లాడుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు , జారే ఆదినారాయణ తెల్లం వెంకట్రావు , కోరం కనకయ్య జిల్లా కలెక్టర్ అంకిత్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

ఇట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.