జీతాల కోసం కార్మికుల ధర్నా. మెడికల్ కాలేజీ కార్మికులకు శ్యాం నాయక్ మద్దతు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 07: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.

 

ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులకు మూడు, నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులకు మద్దతు తెలిపారు.కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న, సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి రెండు రోజుల్లోగా జీతాల సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే పోలీసు అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్‌ను పిలిపించి కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.సమస్య పరిష్కారమయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటానని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని శ్యామ్ నాయక్ హామీ ఇచ్చారు.

spot_img
spot_img

Related articles

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

  నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం...

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

ఇట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.