పోరు తెలంగాణ అక్టోబర్ 07: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కౌటాల మండలం గుడ్లబోరి గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.గుడ్ల బోరి గ్రామానికి చెందిన యువ నేత వాయుకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని 10 నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులను పోస్టాఫీసులో రూ.5 లక్షల వరకు కవరేజ్ కలిగిన వ్యక్తిగత ప్రమాద బీమా పథకంలో నమోదు చేయించారు. అనంతరం లబ్ధిదారులకు బాండ్ పేపర్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది మంగ, ఉప సర్పంచ్ మదనయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వసంతరావు, కేర్కర్ సంతోష్, నాగేశ్వరరావు, హాల్కే మోరేశ్వర్, సాగర్రావు, బాజీరావు తదితరులు పాల్గొన్నారు.

