పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమాచార హక్కు రక్షణ సంస్థ 9వ వార్షికోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు అరటిపండ్లు పంపిణీ చేసి, సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కుమ్మరి లింగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అరటిపండ్లు పంపిణీ చేశారు. అనంతరం సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంపొందించడానికి, ప్రజలకు ప్రభుత్వ సమాచారం అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని, సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కుతో పారదర్శకత పాలన 9 వ వార్షికోత్సవం. రోగులకు పండ్ల పంపిణీ సమాచార హక్కు పై అవగాహన.
Date:
Share post:

