సాయిరాం యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

Date:

Share post:

📰 Generate e-Paper Clip

మండలంలోని రావీ చెట్టు వాడలో సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా చిన్నారుల భవిష్యత్తుకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని, మహిళల భాగస్వామ్యంతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్షరాభ్యాస కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాలు దిద్దించి, విద్యాభ్యాసానికి శుభారంభం చేశారు. అనంతరం నిర్వాహకులు చిన్నారులకు పలకలు, నోట్‌బుక్కులు అందజేశారు.

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, భీమారం మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాయిరాం యూత్ దుర్గ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.

ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని సమితి సభ్యులు కోరారు.

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.