బక్కని రవి.. ఎమ్మార్పీఎస్ నుంచి సస్పెన్షన్

Date:

Share post:

📰 Generate e-Paper Clip

బక్కని రవి.. ఎమ్మార్పీఎస్ నుంచి సస్పెన్షన్..

ఎమ్మార్పీఎస్ నేతల మండిపాటు..
మహేశ్వరం, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి:

కల్వకోల్ గ్రామానికి చెందిన బక్కని రవి మాదిగను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ సంస్థ నాయకులు ప్రకటించారు. బక్కని రవి ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధిగా పనిచేసినట్లుగా నాయకులు పేర్కొన్నారు. ఆయన ఎమ్మార్పీఎస్ నాయకత్వానికి, సంస్థ వ్యవస్థాపకులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారంటూ ఆరోపించారు.
బక్కని రవి తన పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 1న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను ఎమ్మార్పీఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం మహేశ్వరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక పై ఎమ్మార్పీఎస్ పేరు ఉపయోగిస్తే చర్యలు తప్పవు బక్కని రవి నిర్వహించే ఎలాంటి సమావేశాలు, కార్యక్రమాలు, ప్రకటనలు, మీడియా సమావేశాలు లేదా ఇతర కార్యక్రమాలకు ఎమ్మార్పీఎస్ కు ఎలాంటి సంబంధం లేదని నాయకులు స్పష్టం చేశారు.ఆయన చేసే వ్యక్తిగత కార్యక్రమాలను ఎమ్మార్పీఎస్ అధికారిక కార్యక్రమాలుగా పరిగణించబోమన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్ పేరు, జెండా, సంస్థ గుర్తింపు లేదా నాయకత్వం పేరును తమ అనుమతి లేకుండా ఎవరైనా ఉపయోగిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నాయకులు హెచ్చరించారు. సంస్థ పేరును ఉపయోగించి కార్యకర్తలు, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ సామాజిక న్యాయం, మాదిగల హక్కులు, ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తోందని నాయకులు తెలిపారు. సంస్థలో కొనసాగుతూ మరో రాజకీయ పార్టీలో చేరాలనుకునే వారు ముందుగా సంస్థ నాయకత్వానికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని, సంస్థకు సమాచారం ఇవ్వకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
ఇకపై ఆయన చేసే ప్రకటనలకు, కార్యక్రమాలకు ఎమ్మార్పీఎస్ బాధ్యత వహించదు. సంస్థ పేరు దుర్వినియోగం చేస్తే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని ఎమ్మార్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు రావుగళ్ల బాబు మాదిగ, సీనియర్ నాయకులు ఎర్ర కృష్ణ మాదిగ, మాజీ మండల అధ్యక్షులు జంగయ్య మాదిగ, ఎర్ర గణేష్ మాదిగ, సీనియర్ నాయకులు ఎర్ర నవీన్ కుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొల్లెపాక ప్రభాకర్ మాదిగ, అధికార ప్రతినిధి కొండని కుమార్ మాదిగ, ఉపాధ్యక్షులు భూపతిగారి శేఖర్ మాదిగ, మండ మోహన్ మాదిగ, పెండ్యాల వంశీ మాదిగ, సీనియర్ నాయకుడు అర్జున్ మాదిగ పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.