ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో లోక్ భవన్ నిరసన

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు చలో లోక్ భవన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాను.

ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకమైన ప్రక్రియను నిర్వహించాలి. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ గారు, ఇండియా కూటమి ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం అప్రజాస్వామిక చర్య.

 

లోక్ భవన్ వద్ద నిరసన చేపట్టిన మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ప్రజల గొంతును అణచివేయలేరు. ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పరిణామాలకు బాధ్యత వహించి రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల అసలైన బలం. ఆ ఓటును కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుంది.

 

 

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.