పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాలకు గురికాకుండా వారికి అవసరమైన భద్రత, సంరక్షణ కోసం న్యాయ సేవల ప్రాధికార సంస్థ (TGLSA) సూచనలు, కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

డిజిటల్ వేదికలపై పిల్లల రక్షణ కోసం వ్యవస్థలను బలోపేతం చేయడానికి న్యాయసేవల సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు.

జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (NALSA) ఆధ్వర్యంలో “డిజిటల్ వేదికలపై పిల్లలకు రక్షణ, సులభంగా న్యాయం అందించడం : ఆన్‌లైన్ లైంగిక వేధింపులను అరికట్టడం, పిల్లలకు అనుకూలమైన న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడం” అన్న ఇతివృత్తంపై దక్షిణాది ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ సదస్సులో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ , సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ విక్రమ్ నాథ్ , సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ , జస్టిస్ ఆర్ మహదేవన్ , జస్టిస్ అలోక్ అరాధే , తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, త్రిపుర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ జస్టిస్ శ్యామ్ కోషి గారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, పలువురు మాజీ న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళలు, పిల్లల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. పోలీసులు, భరోసా కేంద్రాలు, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ప్రత్యేక కోర్టులు, న్యాయ సేవా సంస్థలు వంటి అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయని వివరించారు.

“భరోసా కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు ఒకేచోట పోలీసు సహాయం, వైద్య సేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందిస్తున్నాం. దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. పిల్లల రక్షణ కోసం పోలీసు శాఖలోని విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. CybHER యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం.

విద్యార్థులనే సైబర్ అంబాసిడర్లుగా తయారు చేసి, తమ తోటి విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే పిల్లలకు రక్షణ, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించగలం” అని అన్నారు.

“ఆర్థిక సహాయం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం వరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. TGS-LSA పాఠశాల విద్యాశాఖతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఉపాధ్యాయులు పిల్లలకు వారి చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చాం” అని తెలిపారు.

సైబర్ నేరాల వలలో పిల్లలు పడకుండా ఇలాంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణ విషయంలో ప్రతి పిల్లవాడు, తల్లిదండ్రులు నియంత్రణ కోసం ప్రత్యేకంగా కేటాయించిన నంబర్ – 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం – 1098 నంబర్లు తప్పక గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

“సైబర్ నేరాల బారిన పడకుండా పిల్లలకు తల్లిదండ్రుల మద్దతు అవసరం. పిల్లలను తప్పుబట్టే విధంగా కాకుండా ఆసక్తితో అవగాహనతో పిల్లకు మద్దతుగా మార్గదర్శకత్వం చేయాలి. పిల్లలను సురక్షితంగా ఉంచేందుకు మనమంతా కలిసి పనిచేద్దాం. అందుకు ఈ సదస్సులో జరిగే చర్చలు, సూచనలు, సిఫారసులు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తాయని విశ్వసిస్తున్నా” అని పేర్కొన్నారు.

NALSA ఆధ్వర్యంలో దక్షిణాది ప్రాంతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషకరమని పేర్కొంటూ సదస్సునకు హాజరైన ప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి గారు స్వాగతం పలికారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు అత్యంత ముఖ్యమైన సైబర్ సెక్యూరిటీ అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకుని నివారణ చర్యల కోసం ఈ సదస్సు నిర్వహించడంపై ముఖ్యమంత్రి, జస్టిస్ విక్రమ్ నాథ్ కి, NALSA కు ధన్యవాదాలు తెలిపారు.

“ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న తెలంగాణ హైకోర్టుకు, TGSLSAకు ధన్యవాదాలు. న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు. న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం. గౌరవాన్ని తిరిగి ఇవ్వడం. ముఖ్యంగా పిల్లలు కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం. న్యాయ సేవల ప్రాధికార సంస్థల కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది” అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

❇️ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవల కోసం సిద్ధం చేసిన సంచార లోక్ అదాలత్ (Mobile Lok Adalat) వాహనాలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గారు, న్యాయమూర్తుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

spot_img
spot_img

Related articles

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.