ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, అక్టోబర్ 10 ji

ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ (EU–NMU–TMU) కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఎంప్లాయిస్ యూనియన్ కూటమిపై కార్మికులు మరోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు.

ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అద్దె సంఘాలకు మద్దతు ఇచ్చి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆర్టీసీ కార్మికులు తమ ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పారని నెల్లికంటి సత్యం అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సంఘాలకే కార్మికులు మద్దతుగా నిలుస్తారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, వేతనాలు, మెరుగైన పని పరిస్థితుల సాధన కోసం ఎంప్లాయిస్ యూనియన్ కూటమి గతంలో అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించే సంఘాలకు కార్మికుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ విజయం స్పష్టం చేసిందన్నారు.

ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగిందని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతూ వారి హక్కుల సాధనకు కృషి చేయాలని ఎంప్లాయిస్ యూనియన్ కూటమికి ఆయన సూచించారు. కూటమి విజయానికి కృషి చేసిన కార్మికులందరికీ మరోసారి అభినందనలు తెలిపారు.

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.