వరంగల్ ఎస్వీఎన్ రోడ్డు బట్టల బజార్లో విహారి ఫ్రెండ్స్ అసోసియేషను గత 30 సంవత్సరాల నుండి అంకిత భావం, సేవ భావంతో సమిష్టిగా సహాయ సహకారాలు అందిస్తూ 30వ వార్షికోత్సవ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి గతంలో చేసిన స్వచ్ఛంద కార్యక్రమాలు మరియు భవిష్యత్తులో కార్యచరణ రూపం గురించి చర్చించి ముందుకు పోదామని అధ్యక్ష కార్యదర్శులు టి. అశోక్, గందె గోవిందరాజులు సభ్యుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానంతో నిర్ణయించడమైనది. ఈ సందర్భంగా వరంగల్ రామన్నపేట లోని డాక్టర్. ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్. ఏ . రాజేంద్రప్రసాద్ గత 26సంవత్సరాల నుంచిరాజేంద్రప్రసాద్ చేస్తున్న స్వచ్ఛంద,సామాజిక, వైద్య, విద్య ఆర్థిక సహాయ సహకారంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాలుఅందించడంలో ముందుకు సాగుతున్న సందర్భంగా గౌరవ సూచకంగా సభ్యులందరూ కలిసి ఘనంగా సన్మానించడం జరిగినది. మేనేజింగ్ ట్రష్టి మాట్లాడుతూ మీరు నాపై ఉన్న అభిమానంతో నమ్మకంతో ఆప్యాయంగా సన్మానించడం వల్ల నా బరువు బాధ్యతలు ఇంకా పెరిగిందని సంతోషం వెలిబుచ్చారు.
ఈ కార్యక్రమంలో అల్లాడి అప్పారావు, అల్లాడి కుమారస్వామి, రఘువీర్, పులిమాటి మనోహర్, టి.అశోక్ కుమార్ ఇంకా 30 మంది సభ్యులు పాల్గొన్నారు.

