పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు తెలంగాణలో వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను పరిచయం చేసేలా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతి, ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

* డిసెంబరు 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లను ఈరోజు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపజేసేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించి… ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

* ఇందుకు గ్లోబల్ సమ్మిట్‌ను ఒక కీలక వేదికగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి అన్నారు. అందుకు అనుగుణంగా సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పెండింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా నిర్దిష్ట కార్యాచరణతో ముందుకెళ్లాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భద్రత, పార్కింగ్, హాస్పిటాలిటీ, కనెక్టివిటీ, ట్రాన్స్ పోర్ట్, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్నెట్, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆతిథ్యం అందించాలని మంత్రి శ్రీ శ్రీధర్ బాబు సూచించారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్, టాలెంట్ పూల్, స్కిల్ డెవలప్‌మెంట్ సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా ఎక్స్‌పో జోన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని చెప్పారు. ముఖ్యంగా… ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్ తదితర కీలక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని మంత్రి సూచించారు.

spot_img
spot_img

Related articles

తెలంగాణలో రూ.6,700 కోట్ల ధాన్యం మళ్లింపు కలకలం.. రైస్ మిల్లర్లపై ఈడీ ఉచ్చు.! • 2021–22 నుంచి భారీగా పక్కదారి పట్టిన ప్రభుత్వ ధాన్యం. • మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు సంబంధించిన...

పోరు తెలంగాణ న్యూస్//హైదరాబాద్ తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం మళ్లింపు ఆరోపణలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. 2021–22 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6,700 కోట్ల...

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..విద్యుత్ ఏ డి ఈ శంకర్..

మహేశ్వరం, నవంబర్ 21, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: నేడు మహేశ్వరం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏ...

తరాల మధ్య పేదరికం కొనసాగింపునకు బాల్యవివాహాలే కారణం

*తరాల మధ్య పేదరికం కొనసాగింపునకు బాల్యవివాహాలే కారణం* .... *ప్రయోగాల దశలో పెండ్లితో చేటు-చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్*.. ---------------------------- చిన్న...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.