రాహుల్ గాంధీ సంకల్పానికి కార్యరూపం ఇచ్చి బీసీ కుల గణనను సాకారం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని పేర్కొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్ గౌడ్‌ ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్…. కాంగ్రెస్ నాయకులు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ న్యూస్// హైదరాబాద్

శంషాబాద్‌ లో ఆదివారం నిర్వ‌హించిన‌ టీపీసీసీ ఓబీసీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రానికి బీసీ నేత సీఎం కావడం ఖాయమని అన్నారు. బీసీ సీఎం అభ్యర్థికి రాహుల్, ఖర్గే, రేవంత్‌ రెడ్డి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికో.. ఏ ఒక్కరికో.. లేదా ఒక ప్రాంతానికో సొంతం కాదని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కాలనేదే రాహుల్ నినాదమని వివరించారు. అన్ని కులాల మద్దతుతో తమ వాటా దక్కించుకుంటాం అవసరమైతే లాక్కుంటామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ అని చెప్పుకునే మోదీ.. బీసీలకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని 100 సీట్లకు తగ్గకుండా సీట్లు వస్తాయని తెలిపారు.

రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రతో ఎవరు ఎంతో వారికి అంత అనేది నినాదంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 55 శాతానికి పైగా సర్పంచ్ లను చేశామని.. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో 58 శాతం బీసీలకు సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. మంత్రివర్గంలో, ఎమ్మెల్సీల్లో, కార్పొరేషన్లలో బీసీల సంఖ్యను పెంచుతామని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రుల సహకారంతో కుల సర్వే నిర్వహించి డాక్యుమెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. బీసీ వంచన చేస్తున్న మోదీ.. తెలంగాణ పిలుపు కేంద్రానికి కనువిప్పు కావాలని అన్నారు. మోదీ గద్దె దిగే టైం వచ్చిందని ఆరోపించారు.

అలాగే రానున్న ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం తథ్యమని.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కులాలను పక్కనపెట్టి బీసీలు అందరూ ఏకం కావాలని వివరించారు. తాము న్యాయమైన కోరికనే కోరుతున్నామని.. మన వాటా మనకు వచ్చే వరకు పోరాడాలని ఈ మేరకు మ‌హేశ్ కుమార్‌ గౌడ్ పిలుపునిచ్చారు.

అటు ఇదే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీల జనాభా ఎంతుందో తెలుసుకోవడం కేవలం లెక్కల కోసం కాదు వారి హక్కులు, వాటా, అవకాశాలు, అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఇది పునాదని అన్నారు. బీసీల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని.. కుల గణన జరగాలి.. బీసీలకు న్యాయం జరగాలి.. జనాభా ప్రాతిపదికన హక్కులు, అవకాశాలు దక్కాలని తెలిపారు. సామాజిక న్యాయం సాధించే వరకు తమ గొంతు బలంగా వినిపిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.

Previous article
Next article
spot_img
spot_img

Related articles

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.