జాతీయ జన గణనలో ఓబీసీ కులాల గణన చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో, టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే శంకరయ్య అధ్యక్షతన నిన్న శంషాబాద్ లోనీ గొల్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు గార్లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సిడబ్ల్యుసి సభ్యులు వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రజా ప్రతినిధులు, పలువురు బీసీ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ లు, పార్టీ ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

