ఇల్లందు కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

Date:

Share post:

📰 Generate e-Paper Clip

ఇల్లందు: ఇల్లందు పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంగణాన్ని ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వ్యాపారుల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యాపార పరిస్థితులు, లాభనష్టాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత కమిషనర్‌కు సమస్యలను తక్షణమే పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు.

అనంతరం నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కార్యవర్గం సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి, వ్యాపారులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

spot_img
spot_img

Related articles

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...

బస్తాలపై క్యూఆర్ కోడ్.. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్!

తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసే విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. 📲 క్యూఆర్...

భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్ ...

సమాచార హక్కు చట్టం పై అవగాహన కార్యక్రమం.

జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహణ... పోరు తెలంగాణ అక్టోబర్ 17: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.