సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూములకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూములకు సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.  సందర్భంగా రెండు గ్రామాల పరిధిలో జరిపిన సర్వే వివరాలను అధికారులు వివరించారు.

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండగా, రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని తెలిపారు. ఆ సర్వే నంబర్‌లో 45 ఎకరాల భూమి కనిపించడం లేదని చెప్పారు.

ఆ గ్రామాల పరిధిలో లెక్కలోకి రాని 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించారు. ఆ మేరకు లెక్కలోకి రాని భూమిని గుర్తించడానికి ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

భూముల సరిహద్దుల్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెందిన భూముల రెవెన్యూ రికార్డులు సమర్పించాలని నోటీసులు జారీ చేయనున్నారు.

సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. సర్వే నంబర్ 325లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని సమావేశంలో ముఖ్యమంత్రి  ఆదేశించారు.

తెలంగాణ అమరవీరుల కాలనీలో అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అన్ని సౌకర్యాలతో కాలనీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని చెప్పారు. జూన్ 2 తేదీలోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు

spot_img
spot_img

Related articles

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...

జ్యువెలరీ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం

Oct 19, 2026, తెలంగాణ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్దఉన్న శ్రీ విజయలక్ష్మి జ్యువెలరీ వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది....

భీమారం సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చండి హోమం

భీమారం మండల కేంద్రంలోని శ్రీ సాయి యూత్ దుర్గా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో  దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మండపంలో చండీ హోమాన్ని...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.