పోరు తెలంగాణ న్యూస్// ఆదిలాబాద్
రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు అవుతాయని, అధిక లాభాలు వస్తాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
రూ.1,000 నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి ప్యాకేజీలు ప్రవేశపెట్టి, కొత్త సభ్యులను చేర్చిన వారికి 25 శాతం వరకు కమీషన్ ఇస్తామని ఆశ చూపినట్లు గుర్తించారు. జూమ్ మీటింగ్‌లు, హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను ఆకర్షించారు.
ఆదిలాబాద్‌లోనూ పలువురు బాధితులు.. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు లక్షల రూపాయలు పెట్టుబడిగా చెల్లించినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రధాన ఫిర్యాదులో జువ్వక నర్సింలు రూ.7.50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. ఇతర బాధితుల ఫిర్యాదులు తీసుకొని దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు.

