దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..నారాయణపురంలో పండుగ సందడి*_ _*పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

నారాయణపురం:: దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి గ్రామంలో బస చేసిన ఆయన.. మంగళవారం ఉదయం స్థానిక దేవాలయంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.పంచె, లాల్చీ ధరించి, అంచులున్న కండువాను మెడలో వేసుకుని పూజల్లో పాల్గొన్న మంత్రి.. పండుగ వేళ స్వగ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.

గ్రామస్తులతో ఆత్మీయ పలకరింపులు..

మంత్రి స్వగ్రామానికి చేరుకోవడంతో నారాయణపురంలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరించిన పొంగులేటి.. ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ తమ మధ్యకు వచ్చిన మంత్రిని కలుసుకోవడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.

spot_img
spot_img

Related articles

చిట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

ఇట్యాల గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.

పోరు తెలంగాణ అక్టోబర్ 19: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలోని ఇట్యాల గ్రామంలో సద్దుల బతుకమ్మ...

రేపు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

  Oct 19, 2026, తెలంగాణ : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నారు. దసరా వేడుకల కోసం సొంతూరికి వెళ్లనున్నారు....

బతుకమ్మ వేడుకలో విషాదం: సంబరాల్లో యువతి మృతి

Oct 19, 2026, కొమురంభీం జిల్లా, ఆసిఫాబాద్‌లోని బాబాసాగర్ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఎలుక వెంకటేష్–సువర్ణ దంపతుల కుమార్తె శ్రీవాణి, బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటుండగా...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.