పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియుడు..ఇంటి ఎదుట యువతి బైఠాయింపు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ డిజిటల్ డెస్క్ :- మెట్ పల్లి పట్టణంలోని ఏకలవ్యనగర్‌లో ప్రేమ పేరుతో వంచించి పెళ్ళికి నిరాకరిస్తున్న యువకుని ఇంటిముందు గత రెండు రోజులుగా యువతి బైఠాయించారు.ఈ సందర్బంగా మాట్లాడతూ…ఏకలవ్యనగర్‌కు చెందిన అంగడి శిరీష అనే యువతీ అదే కాలనీ కి చెందిన పాలకుర్తి సతీష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నప్పటికీ సతీష్ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.సతీష్ విదేశాలకువెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని,తనకు వచ్చిన వివాహ సంబంధాలను సైతం తిరస్కరించాలని మాయ మాటలతో నమ్మించి ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి నిలదీయగా వారి కుటుంబ సభ్యులతో కలిసి తనపై దాడి చేసి గాయపరచారన్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవట్లేదని యువతి ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో తనకు న్యాయం చేయాలంటూ శనివారం నుండి సతీష్ ఇంటి ఎదుట బైఠాయించగా ప్రియుని కుటుంబ సభ్యులు ఇల్లుకు తాళం వేసి పారిపోయారని తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు.అటు తన కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వడం లేదని,ఇటు ప్రియుని కుటుంబ సభ్యులు రానివ్వడం లేదంటూ తనకు చావే శరణ్యమని శిరీష తెలిపారు.

spot_img
spot_img

Related articles

తెలంగాణ కాంగ్రెస్ క్యాబినెట్ లోకి రాములమ్మ.!

కేబినెట్ లోకి రాములమ్మ.! కొండా సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలి అని హైకమాండ్ నిర్దేశించినట్లు తెలుస్తుంది. సురేఖ పై వేటుతో అధికార కాంగ్రెస్ లో...

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.