పాదయాత్ర ప్రకంపనలు… ఎందుకింత ఉలికిపాటు?*

Date:

Share post:

📰 Generate e-Paper Clip

*పాదయాత్ర ప్రకంపనలు… ఎందుకింత ఉలికిపాటు?*

మిత్రులారా.. మంచిలో చెడు వెతకడం మొదలైంది.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు పాదయాత్రలో లోపాలు వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నాలుగు నియోజకవర్గాలు, దాదాపు 20 మండలాలను కలుపుకుని సాగిన ఈ యాత్ర ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో, దానిపై వస్తున్న విమర్శలే చెబుతున్నాయి. ఓట్లు, పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. కేవలం జర్నలిస్టుల హక్కుల కోసం సహచరులతో కలిసి యువ నాయకుడు సయ్యద్ ఖదీర్ చేపట్టిన ఈ యాత్ర, మండల జర్నలిస్టుల్లో కొత్త చైతన్యానికి నాంది పలికింది.

దశాబ్దాల చరిత్ర, సీనియారిటీ, అనుభవం గురించి మాట్లాడుతున్నా.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య మాత్రం ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. వినతిపత్రాలు, సమావేశాలు, హామీలతో కాలం గడిచింది. జర్నలిస్టులు ఇప్పటిదాకా నిరాశతోనే బతుకుతున్నారు. కానీ మనం చేపట్టిన ఈ పాదయాత్ర జిల్లా కేంద్రం గడప దాటి మండలాల బాట పట్టింది. మండల జర్నలిస్టులను కలవడం, వారిలో ధైర్యం నింపడం, అధికారుల ముందు వారిని నాయకులుగా నిలబెట్టడం, వారి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఈ యాత్ర ప్రధాన లక్ష్యంగా నిలిచింది.

ఇది బస్సు యాత్ర కాదు.. ప్రచార యాత్ర కాదు.. ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం అంతకంటే కాదు. జిల్లా రిపోర్టర్ నుంచి మండల రిపోర్టర్ వరకు చేయి చేయి కలిపి నడుస్తూ, ప్రతి మండలంలో స్థానిక అధికారులను కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కోరుతూ ముందుకు సాగింది. ఫోటోల కోసమో, వీడియోల కోసమో మనం యాత్ర చేపట్టలేదు.. భవిష్యత్తులో మండల స్థాయిలోనూ అధికారులను ప్రశ్నించే బలమైన జర్నలిస్టు నాయకత్వాన్ని తయారు చేయాలనే సంకల్పంతో ఈ యాత్ర జరిగింది. అందుకే ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ వర్గాలు, అధికారులు సైతం స్వచ్ఛందంగా తమవంతు మద్దతు అందించారు.

ఈ యాత్రలో మహనీయుల స్ఫూర్తికి ప్రత్యేక స్థానం కల్పించారు. పలుచోట్ల తెలంగాణ తల్లి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ పాపన్న గౌడ్ వంటి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి ఆశయాలను స్మరించుకుంటూ, సామాజిక న్యాయం, సమానత్వం, అహింస, ఆత్మగౌరవం అనే విలువలను స్ఫూర్తిగా తీసుకుని యాత్రను కొనసాగించారు. పాదయాత్రను ఎవరు ఎలా పిలిచినా.. మండల జర్నలిస్టు సమస్య కోసం వారి దగ్గరకు వెళ్లి, వారితో కలిసి నడిచింది ఎవరు? అన్నదే అసలు ప్రశ్న.

ఈ యాత్రలో ఇద్దరు మహిళలు చూపిన అచంచలమైన ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణ ప్రత్యేకంగా నిలిచాయి. ఎన్నో సవాళ్ల మధ్య అడుగడుగునా పాదయాత్రలో పాల్గొని, చివరి వరకు తోడుగా నడిచి యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం సాధారణ విషయం కాదు. వారి భాగస్వామ్యం వ్యక్తిగత పట్టుదలకు మాత్రమే కాదు.. ఫెడరేషన్‌పై జర్నలిస్టులకు ఉన్న విశ్వాసానికి, ఉద్యమ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. పదవులు, ప్రాభవాలు కాదు.. సమస్య పరిష్కారం కోసం ముందుకు నడిచే ధైర్యమే నిజమైన నాయకత్వమని ఈ యాత్ర మరోసారి నిరూపించింది.

ఈ పాదయాత్ర ముగింపు కాదు.. మరో బలమైన ఉద్యమానికి ఆరంభం. సంఘాలకతీతంగా జిల్లా జర్నలిస్టులందరినీ ఐక్యం చేసి, అర్హత ఉన్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు ఇంటి స్థలం సాధించే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగించాలనే సంకల్పంతో ఫెడరేషన్ ముందుకు సాగుతోంది. ఇది కంఠశోష కాదు.. ఆత్మఘోష! ఇది ఫోటోల కోసం యాత్ర కాదు.. భవిష్యత్తు కోసం వేసిన అడుగులు! ఇది వ్యక్తి కోసం కాదు.. ప్రతి వర్కింగ్ జర్నలిస్టు ఆత్మగౌరవం కోసం సాగుతున్న ధర్మపోరాటం!

*జై జర్నలిస్టుల ఐక్యత*

*జై హక్కుల పోరాటం*

*జై ఫెడరేషన్!*

విప్లవాభివందనాలతో …

మీ

*చక్రవర్తి*

సీనియర్ జర్నలిస్ట్

spot_img
spot_img

Related articles

కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు.

 జన్మాష్టమిని సెప్టెంబర్‌ 4న భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి పూజా మందిరాన్ని అలంకరించి, బాలకృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి పూజించడం ఆనవాయితీ....

గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నా రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు* గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సెప్టెంబర్04//: ఖమ్మం-కూసుమంచి, సెప్టెంబర్- గ్రామాల...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...

తెలంగాణ ప్రణాళికా బోర్డు నూతన వైస్‌ చైర్మన్‌గా గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి తెలంగాణ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.