గూడెం చెక్పోస్ట్ వద్ద 15 క్వింటాళ్ల పటిక స్వాధీనం.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

చింతల మానేపల్లి సెప్టెంబర్ 18:

 నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా పట్టికను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన చింతలమానపల్లి మండలంలో చోటుచేసుకుంది. గూడెం చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రలోని ఆహేర్ నుంచి బొలెరో వాహనంలో పట్టికను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం..

కోర్సిని గ్రామానికి చెందిన తోడేటి రాజేష్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఆహేర్ నుంచి సుమారు 15 క్వింటాళ్ల పట్టికను బొలెరో వాహనంలో తీసుకొస్తుండగా గూడెం చెక్‌పోస్ట్ వద్ద పట్టుబడ్డాడు. స్వాధీనం చేసుకున్న పట్టిక విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు, లంబడిహట్టి గ్రామానికి చెందిన శ్యామ్ అలియాస్ శ్యామ్‌లాల్ సూచనల మేరకే పట్టికను తీసుకొస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పట్టికను విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు నిందితుడు విచారణలో తెలిపినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు బొలెరో వాహనంతో పాటు 15 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చింతలమానపల్లి ఎస్సై యం కమలాకర్ తెలిపారు.

spot_img
spot_img

Related articles

దళిత ఆదివాసి ఆత్మ గౌరవ సభ లో అజ్మీర శ్యామ్ నాయక్

సెప్టెంబర్ 30: న్యూఢిల్లీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభలో ఆసిఫాబాద్ నియోజకవర్గ...

దసరాకు పుట్టింటికి వెళ్లొద్దన్నాడని మహిళ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా: దసరా పండగకు పుట్టింటికి వెళ్లే విషయమై భర్తతో ఏర్పడిన మనస్పర్థలతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన నస్పూర్ మండలం...

సిరిసిల్ల నుంచే ప్రతిపక్షాలకు సీఎం సందేశం. ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. -కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్.

సిరిసిల్ల : ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో...

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా

కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం కాళేశ్వరం జోన్‌-I డీఐజీ అంబర్‌ కిషోర్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి,విధులు నిర్వహిస్తున్న అధికారులు,...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.