ఆదిలాబాద్, సెప్టెంబర్ 17:
ఆయుర్వేద వైద్య విధానంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ఉపశమనం పొందే అవకాశం ఉందని మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన డాక్టర్ ఎస్.బి. దేవ్కర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వాసుకి వైస్ మీటింగ్ హాల్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ‘జీవన్ శక్తి పవర్’ గురించి వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవ్కర్ మాట్లాడుతూ, ‘జీవన్ శక్తి పవర్’ ద్వారా 700కు పైగా రోగాలకు స్వస్థత చేకూర్చే శక్తి ఉందని వివరించినట్లు తెలిపారు. ఆయుర్వేదంలో ఉన్న వివిధ విధానాలు, ఆరోగ్య పరిరక్షణలో వాటి ప్రాధాన్యత గురించి సమావేశంలో అవగాహన కల్పించారు. ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలకు తగిన చికిత్సా విధానాలను అవలంబించవచ్చని ఆయన వివరించారు. సమావేశానికి హాజరైన పలువురు ఆయుర్వేదం, ‘జీవన్ శక్తి పవర్’కు సంబంధించిన అంశాలపై ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మరియు ఇన్చార్జులు జిల్లా మేనేజర్లు సంతోష్ తోగర్, ఉప్పరి నాగేష్ మంచిర్యాల జిల్లా నుండి నందిపేట రాజేష్ వడ్లూరి నరేష్ ఆదిలాబాద్ నుండి కినాకే శంకర్ పాల్గొన్నారు.

