హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి

Date:

Share post:

📰 Generate e-Paper Clip

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

పోరు తెలంగాణ మంచిర్యాల,సెప్టెంబర్ 10, 2026:

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2026లో నోటీసుల జారీ అనంతరం సంబంధిత ఓటర్ల నుండి స్వీకరిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, ప్రత్యేక ఉపపాలనాధికారి చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ–2026లో హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ క్రమంలో మార్కింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల విచారణ వేగవంతం చేయాలని, అర్హత గల ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని తెలిపారు. జాబితాలో గల ఓటర్లు తమ వివరాలను సమర్పించేలా రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా చర్యలు తీసుకోవాలని, ఎస్.ఐ.ఆర్.–2026 ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు...

సిరిసిల్ల సభ విజయవంతం., ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగున ప్రజల నీరాజనాలు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో రూ. 340 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా సిరిసిల్ల...

కరీంనగర్ నూతన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి

కలెక్టరేట్ భవనం పేదవాడికి నమ్మకం కల్పించాలి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలా ఉద్యోగులు పనిచేయాలని సూచించాను....

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ప్రారంభించినముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సముదాయం ఆవరణలో తెలంగాణ తల్లి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.