గాంధీ జయంతి సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టిన సిర్పూర్ శాసనసభ్యులు

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 02 :

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి “క్లీన్ అండ్ గ్రీన్” డ్రైవ్ నిర్వహించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు అక్కడి మరుగుదొడ్లను శుభ్రం చేశారు . పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. బస్టాండ్ ఆవరణలో పూర్తిగా చెత్తను తొలగించి చెట్లు నాటడం జరిగింది. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత దేశవ్యాప్తంగా కోట్లాది గృహాలకు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని,మహిళల ఆత్మ గౌరవానికి పెద్దపీట వేశారని తెలిపారు. వారి స్ఫూర్తితో గాంధీ జయంతి సందర్భంగా బస్టాండ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి పరిసరాలను శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం బస్టాండ్ భవన్ లో ఉన్న ప్రజలకు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తిని అరికట్టాలని, తద్వారా డెంగ్యూ తదితర వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోలేమని అన్నారు. తమ పిల్లలకు కూడా పరిశుభ్రత విషయంలో తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని తెలిపారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రయాణికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కౌన్సిలర్ చిప్పకుర్తి శ్రీనివాస్, ఈర్ల విశ్వేశ్వర్ రావు, నాయకులు గొల్లపల్లి వీరభద్ర చారి, కొప్పుల శంకర్, హనుమంతరావు, అరుణ్ లోయా, లోనరే రవీందర్, అగ్గిళ్ళ శ్రీనివాస్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

హైదరాబాద్// హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ...

హిమాచల్ ప్రదేశ్ లోని మౌంట్ తరంగ్ 2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన గురుకుల విద్యార్థి 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్‌ అవలీలగా అధిరోహించిన ఇస్లావత్‌ బన్నీ తొలి భారతీయ బృందంలో చోటు.....

హైదరాబాద్‌, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తయిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్‌ బన్నీ నిరూపించారు....

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.