బారెగూడ గ్రామపంచాయతీలో ఘనంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

పోరు తెలంగాణ అక్టోబర్ 02:

గాంధీ జయంతి సందర్భంగా కాగజ్ నగర్ మండలం బారెగూడ గ్రామ పంచాయతీలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ కోట వేణుగోపాల్ పాల్గొని మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేసుకునే దిశగా బారెగూడ గ్రామం ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామ అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి పనిచేసినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకుంటూ, పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతులు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ బారెగూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అన్ని శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

spot_img
spot_img

Related articles

గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు..!!

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి//హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 63 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ 28, ల్యాబ్ టెక్నీషియన్,...

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌ సాయితో భేటీ

సీఎం శ్రీ రేవంత్‌ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌ సీఎం శ్రీ విష్ణుదేవ్‌...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.