గాంధీ జయంతి సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టిన సిర్పూర్ శాసనసభ్యులు.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

కాగజ్ నగర్ అక్టోబర్ 02:

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో గాంధీ జయంతి సందర్భంగా కాగజ్‌నగర్ బస్టాండ్ ఆవరణలో సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఆవరణలోని చెత్తను పూర్తిగా తొలగించి చెట్లు నాటారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో స్వచ్ఛ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించి, మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.
ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని దోమల వ్యాప్తిని అరికట్టాలని, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలని బస్టాండ్‌లోని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండవని, పిల్లలకు పరిశుభ్రతపై తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. అనంతరం ప్రయాణికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

spot_img
spot_img

Related articles

ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మరియు సహచర మంత్రులతో కలిసి ప్రత్యేక ప్రయాణం

హైదరాబాద్// హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్‌ను ప్రజలకు చేరువ...

హిమాచల్ ప్రదేశ్ లోని మౌంట్ తరంగ్ 2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన గురుకుల విద్యార్థి 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్‌ అవలీలగా అధిరోహించిన ఇస్లావత్‌ బన్నీ తొలి భారతీయ బృందంలో చోటు.....

హైదరాబాద్‌, అక్టోబరు 3: సంకల్పం.. క్రమశిక్షణ.. పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తయిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్‌ బన్నీ నిరూపించారు....

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...

ప్రజావాణి కార్యక్రమం రద్దు

మంచిర్యాల// జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అక్టోబర్ 3, 2026: నిర్మల్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమావేశానికి...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.