శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని 18 వ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని స్మరిస్తూ భక్తిపారవశ్యంలో ముందుకు సాగారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. గిరి ప్రదక్షిణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

