పోరు తెలంగాణ మంచిర్యాల జిల్లా,నవంబర్ 12, 2026:
మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తన నియామకం గురించి తెలియజేశారు.ఈ సందర్భంగా ఏ. పురుషోత్తం మాట్లాడుతూ జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ULLAS – నవ భారత్ సాక్షరత కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజల్లో విద్య పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్లు ఏ. సత్యనారాయణమూర్తి, ఎం. సుమన్ తదితరులు పాల్గొని నూతన జిల్లా ఇన్‌చార్జి ఏ. పురుషోత్తంకు శుభాకాంక్షలు తెలియజేశారు.

