22A దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరానికి  కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలి.

Date:

Share post:

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్ . బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు 22-ఎ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు, ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లపై హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22A భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించాను.

22A సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీల‌కు అనుగుణంగా జీవో 118, జీవో 76లకు సంబంధించి మెమోలు జారీ చేయడం జరిగింది. ఆదేవిధంగా 22A జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతులు, యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారం, నాలా ప్రక్రియ, జీవో 59 అమలు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు వ‌చ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. ఏ ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ప్రతి వారం జిల్లా స్థాయిలో అధికారులు సమావేశమై 22A సమస్యల పరిష్కారంపై సమీక్షించాలి. జిల్లా స్థాయిలో పరిష్కరించడానికి వీలుకాని వాటిని ఉన్నతస్థాయి కమిటీకి సిఫార్సు చేయాలని సూచించాను.

అదేవిధంగా యూఎల్ సికి సంబంధించి వివిధ కోర్టులు వెలువరించిన తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్‌ఎల్‌పీలు) దాఖలు చేసే అంశాలు, ఎస్‌ఎల్‌పీలు దాఖలు చేయడానికి అవకాశం లేని ఇతర అంశాలన్నింటిపై వారం రోజుల్లోగా ఉన్నతస్థాయి కమిటీ సమగ్ర నివేదిక అందించాలి. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి రెగ్యులరైజేషన్‌పై తగిన నిర్ణయం తీసుకుంటాము.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అర్హులకు న్యాయం చేసే క్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదు.

 

 

spot_img
spot_img

Related articles

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రులు

భారత్ సమ్మిట్–2026లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Rahul Gandhi కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన...

తెలంగాణలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వమే ప్రభుత్వ అభివృద్ధి విధానం* *భారత్ సమ్మిట్ – 2026 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*

*హైదరాబాద్, నవంబర్ 13:* విద్య, సంక్షేమం, సాధికారత ద్వారానే సమాజంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, వయోవృద్ధులు,...

వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా ఏ. పురుషోత్తం బాధ్యతల స్వీకరణ

పోరు తెలంగాణ మంచిర్యాల జిల్లా,నవంబర్ 12, 2026: మంచిర్యాల జిల్లా వయోజన విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జిగా నూతనంగా నియమితులైన ఏ. పురుషోత్తం గురువారం బాధ్యతలు...

రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

Nov 13, 2026, రెండేళ్ల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో ఆహార ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి చేరింది. ఆర్బీఐ...
App Icon

Install PORU TELANGANA App

Add to home screen for faster loading and latest updates.