ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కర్ణాకర్ ఇటీవల దుబాయ్లో మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దుబాయ్లో ఉన్న ఆలూర్ ప్రాంత సభ్యులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. తమ వంతు సహాయంగా చందాలు సేకరించి రూ.36,000 ఆర్థిక సహాయాన్ని కర్ణాకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు తెలిపారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సహాయం అందించిన దుబాయ్ సభ్యులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పతాని నవీన్, బయ్య రవి, బూర్గుల శ్రీనివాస్, నాడిశరం మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

