సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి జి. రమేష్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎరువుల వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు ఫిర్యాదుదారుడి అల్లుడి నుంచి మొత్తం రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.
ఇప్పటికే అక్టోబర్ 19న రూ.10 వేలు తీసుకున్న అధికారి, మిగిలిన రూ.20 వేలు నవంబర్ 3న తన కార్యాలయంలో తీసుకుంటుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
*లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయండి:* ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ *1064* కు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

